>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=9o1CAYoZNDk
Saswathamaina Prematho Full HD Song • శాశ్వతమైన ప్రేమతో తెలుగు క్రైస్తవ గీతము • Bro. Anil Kumar Songs • Telugu Christian Songs • Song Lyrics: • శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా! నీ ప్రేమే నను గెల్చెను! • విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా! నీ కృపయే నను మార్చెను! • నీ ప్రేమ ఉన్నతం, నీ ప్రేమ అమృతం, నీ ప్రేమ తేనెకంటే మధురము! • నీ ప్రేమ లోతులో, నను నడుపు యేసయ్యా! నీ ప్రేమలోన నే వేరు పారి నీకై జీవించనా! • ప్రేమతో ప్రేమతో – యేసయ్యా నిను వెంబడింతును • ప్రేమతో ప్రేమతో ప్రేమతో – యేసయ్యా నిను ఆరాధింతును • • 1. నా తల్లి గర్భమునందు, నే పిండమునైయుండంగా, దృష్టించి నిర్మించిన ప్రేమ • నా దినములలో ఒకటైనా, ఆరంభము కాకమునుపే, గ్రంథములో లిఖియించిన ప్రేమ • నా ఎముకలను, నా అవయవములను, వింతగా ఎదిగించి రూపించిన ప్రేమ • తల్లి ఒడిలో నేను, పాలు త్రాగుచున్నపుడు, నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ • తన సొంత పోలిక రూపులోన నను సృష్టించిన ప్రేమ! • ప్రేమతో ప్రేమతో – నీ కోసం నను సృజియించావయా! • ప్రేమతో ప్రేమతో ప్రేమతో – నను మురిపెంగా లాలించావయా! • • 2. నే ప్రభువును ఎరుగకయుండి అజ్ఞానములో ఉన్నపుడు, నను విడువక వెంటాడిన ప్రేమ • నా సృష్టికర్తను గూర్చి స్మరణే నాలో లేనపుడు, నా కోసం వేచిచూచిన ప్రేమ • బాల్యదినములనుండి నను సంరక్షించి కంటిరెప్పలా నన్ను కాపాడిన ప్రేమ • యౌవ్వన కాలమున కృపతో నను కలిసి సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ • నే వెదకకున్ననూ నాకు దొరికి నను బ్రతికించిన ప్రేమ! • ప్రేమతో ప్రేమతో – యేసయ్యా నను దర్శించావయా! • ప్రేమతో ప్రేమతో ప్రేమతో – నను ప్రత్యేకపరిచావేసయ్యా! • • 3. నే పాపినై యుండగానే, నాకై మరణించిన ప్రేమ, తన సొత్తుగ చేసుకున్న ప్రేమ • విలువే లేనట్టి నాకై, తన ప్రాణపు వెల చెల్లించి, నా విలువను పెంచేసిన ప్రేమ • లోకమే నను గూర్చి, చులకన చేసిననూ, తన దృష్టిలో నేను ఘనుడన్న ప్రేమ • ఎవ్వరూ లేకున్నా, నేను నీకు సరిపోనా, నీవు బహుప్రియుడవని బలపరచిన ప్రేమ • నా ముద్దుబిడ్డ నువ్వంటూ నన్ను తెగ ముద్దాడిన ప్రేమ! • యేసయ్యా! యేసయ్యా! – నాపై యింత ప్రేమ ఏంటయా! • యేసయ్యా! యేసయ్యా! యేసయ్యా! – నను నీలా మార్చేందులకేనయా! • #BroAnilKumar #ChristianSongs #AnilWorldEvangelism #TeluguChristianSongs
#############################
New on site