Sri Venkateshwara Swamy Geetamala Devotional Songs My Bhakthi Tv
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=AmJv7u6JCnI
Title: Sri Venkateshwara Swamy Geetamala • Lyrics: Srirangam Jogi • Composed by: Sudarshanam Venu Madhav • Singer: Mula Srilatha • #venkateswaradevotionalsongs • #lordvenkateswaraswamy • #devotionalchants • Devotional Songs • Published By : Musichouse • Produced by: B.N Murthy Palli Nagabhushana Rao • Recorded at Sri Matha Digital Recording Studio, Visakhapatnam. (8106766133) • శ్రీవేంకటేశ గోవిందా • శ్రీశ్రీనివాస గోవిందా • సప్తగిరీశా గోవిందా • శ్రితజన పాలా గోవిందా • • విందాం విందాం గోవిందుని • శ్రీగిరి నిలయుని శుభ చరితని • అందాం అందాం గోవిందని • ఆనంద నిలయుని శరణమ్మని • • కోరస్: (జయజయజయ గోవిందా • (జయముజయము శ్రీ గోవిందా) • ఆ భృగు పాదం తాకిందని • అలుకతొ లక్షి వెడలిందని • పాలకడలినే విడిచావట • పుడమని చేరి వెతికావట • పుట్టెడు దిగులుతొ తిరిగేవట • పుట్టను చేరి పవళించావట • విషయము తెలియగ విపంచికి • ఈశునికీ కథ వివరించె • నీ ఆకలి దప్పిక తీర్చగను • గోవత్సముల రూపముతో • మహరాజు చెంతకు చేరేను • గోమందతొ కూడి సాగేను • మందతొ మేతకు చరియిస్తూ • ఆ పుట్ట చెంతకు చేరేను • పొట్ట నింపగా తలచేను • పుట్టలొ పాలు విడిచేను • పశువుల కాపరికది తెలిసి • కొట్ట బోవగా చేయెత్తె • అంతట నీవుగ ఎదురొచ్చి • గోవుకు రక్షగ నిలిచేవు • గోపబాలుని కరుణించి • తొలి దర్శన భాగ్యము కలిగించి • ఘనమగు వరమును ఒసగేవు • తరతరాలకూ సాగించేవు • పుట్టను వీడి వెడలేవు • పద్మావతిని వలచేవు • వకుల మాతను చేరేవు • వరము తీర్చగా మసలేవు • అచ్చట ముచ్చటలాడేవు • అమ్మవు నీవని పలికేవు • పెండ్లి మాటను తెలిపేవు • పెళ్ళి మాటలకు పంపేవు • మాటతొ మనువు కుదిరింది • యశోద వరము పండింది • ఆనందం ఎద విరిసింది • ముక్తి ఫలముతో ముగిసింది • కళ్యాణానికి ఆరంభం • కుభేరునితో ఒప్పందం • వడ్డి కాసులకు ఒడంబడి • కాసులు కూడగట్టేవు • రావి చెట్టు మరి సాక్షంగా • రాసిన పత్రం ఇచ్చేవు • యుగ ధర్మం నెరిగించావు • వడ్డీ భారం మోసావు • కళ్యాణం మరి విరిసింది • కమనీయంగా ముగిసింది • సురముని జనులకు సంతోషం • భువిజనులకు ఇది శుభయోగం • • వివాహంలో నీ విందు • విశ్వానికే ఇది పసందు • హరిగిరి శ్రీగిరి ఒక్కటాయెను • అనంతునికే ఇది చిత్రమాయెను • నిను చేరగ వచ్చిన శ్రీలక్ష్మి • నిలదీసి అడిగెను నిను చూసి • నిప్పుల చూపును చూచినది • నిందా వాక్యము పలికినది • • తగవు తీరని తరుణంలో • శిలా రూపమును దాల్చితివి • సజీవ శిల్పమై నిలచితివి • ఏక శిలగా వెలిగితివి • తొండమానునికి తోడుగను • ఆళ్వారునకు అండగను • నిలచితివీవు నిక్కముగా • చేసిన పూజల పుణ్యముగా • బావాజీతో సహవాసం • ఆట మాటల సహచర్యం • నమ్మకానికే నిదర్శనం • నమ్మిన వారికి నిజ దర్శనం • చెఱసాలలో చిత్రంగా • చొరబడ్డావు హథీగా • తెరిపించావు కన్నులను • విడిపించావు బంధములు • వెంగమాంబ వ్యవహారం • తరిగొండ వీడటే పరిహారం • ప్రతినిత్య నీ ఉపచారం • నీ సన్నధి సేవే సంసారం • పాచికలాడగ నీ సాటి • కొంగు వీడుట ఏపాటీ • భక్తులతో ఇది పరిపాటి • భక్త రక్షణలో ఘనాపాఠి • వాడిన పూలకు మురిసి • మట్టి పూలలో మెరిసి • కలిమి ఎంతో కలిగున్నా • మట్టి పాత్రలో నైవేద్యం • పంచ భక్షాలు పెడుతున్నా • పెరుగన్నమే పరమాన్నం • అదే ప్రియమగు నైవేద్యం • నిత్యం దానికి నువు సిద్దం • భార్గవి హృదిలో వసియిస్తూ • బ్రహ్మముగా మరి భాసిస్తూ • నిలువు కొలువులో నిలిచేవు • నిత్య పూజలు బడసేవు • పుడమిని పుట్టిన నదులన్నీ • పదమునంటగా నిను జేరి • పుష్కరణిగ రూపం దాల్చేను • పష్కలంబుగా మురిసేను • శిరో భారమును తగ్గించ • శిరో ముండనము కోరేవు • పాప భారమును తొలగించ • ప్రక్షాళన గావించావు • సేవలు పొందెడి నెపముంచి • నీ సేవా భాగ్యము నొసగేవు • ఒక కళ్యాణమును కల్పించి • లోక కళ్యాణానికి నిలిచేవు • నిత్య కళ్యాణాల నిలిచేవు • నీరాజనాల మెరిసేవు • నీ వాకిట నిలిచిన క్షణమైనా • మా తలపును తాకు నీ వీక్షణం • ఏడు కొండల ఏలికా • ఏడేడు లోకాల.పాలకా • గోవింద నామాన తెలిసేవు • గోవింద నామాన మురిసేవు • గోవింద నామాన మెరుపున్నది • పంచ భూతాల ప్రభ అయినది • ఇహ పరముల మెరుగైనది • ఆద్యంతముల కది రక్ష అయినది • పంచాయుధ పరాయణా • పుడమిని చేరిన నారాయణా • నరుడై వచ్చెను నంధకము • పద కవితల తానే ఘనము • రోజు రోజుకో ఉత్సవం • రోజులన్నిటా మహోత్సవం • వారోత్సవం మాసోత్సవం • ఏటేటా నీకు బ్రహ్మోత్సవం • మాడ వీధుల చేరి తిరిగేవు • మలయప్ప స్వామిగ తెలిసేవు • గరుడ వాహనమెంతొ ఘనమైనది • కల్పవృక్షము కూడ కదిలొచ్చెను • నిధులన్ని నీ చెంత నిక్షేపము • నిత్య కళ్యాణాలు నీ పక్షము • కళశాభిషేకాలు కమనీయము • వారాభిషేకాలు విడ్డూరము • వైకుంఠ ద్వారాలు ఇలకొచ్చెను • సప్తగిరులై ఇచ్చోట శోభించెను • కామిత ఫలములు కురిపించుచూ • కలియుగ వైకుంఠమై ఒప్పేను • • శ్రీగిరి శిఖరాన శ్రీ నిలయము • ఆనందమూర్తికి ఆవాసము • అచ్చోట అగుపించు దృవభేరము • ఆనందమొలకించు శుభ రూపము • వాదాలు వేవేలు వినిపించినా • వేదాల పరమైన నువె సత్యము • ఈశ్వర తేజాన నువు నిత్యము • ఈ సర్వలోకాలు నీ సొంతము • ఇలలోన మాకొరకు వెలసేవు • కలి భారం నీ మోపున మోసేవు • కలి వేంకట నాయక శరణం • సర్వ లోక పాలక శరణం • ఆశ్రిత జనరక్షక శరణం • బ్రహ్మాండ నాయక శరణం • భాగవతోత్తమా శరణం • భవ బంధ నాశక శరణం • • 1. MusicHouse 27: / musichouse27 • 2. MyBhaktitv: / mybhaktitv • 3. MusicHouse 27 Twitter: / musichouse27 • 4. Sri Matha Music Facebook: / srimatha-music-109674363784497 • 5. Sri Matha Music Youtube: / @srimathamusic8507 • NO COPYRIGHT INFRINGEMENT INTENDED. • COPYRIGHT NOTICE: • Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting YouTube about a Copyright Infringement. Thank You, sir... • ****************************************************************************************************************** • My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.
#############################
