Svetha Vaaraahi Namostuthe Sri Sakthi Peetam











>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=R7zwzTrNnv4

#siddheswarananda #siddheswaranandabharatispeeches #courtallam #swamiji #varahidevi • వారాహీ దేవిని లలితాదేవికి సైన్యాధ్యక్షురాలుగా, దండనాథగా, సప్త మాతృకలలో పంచమిగా, వరాహ స్వామి స్త్రీ శక్తిగా, అర్థాంగిగా, లక్ష్మీ స్వరూపంగా కూడా కొలుస్తారు. వారాహీ దేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు అందరూ పూజిస్తారు. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహీ, మరీచి ఈమె ప్రతిరూపాలే అంటారు • మార్కండేయ పురాణంలోని దేవీ మాహాత్మ్యంలో శుంభ-నిశుంభ వధ కథ ప్రకారం సమస్త దేవతల శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. బ్రహ్మ నుండి బ్రహ్మాణి, మహేశ్వరుడి నుండి మాహేశ్వరి, విష్ణుమూర్తి నుండి వైష్ణవి, కుమారస్వామి నుండి కౌమారి, వరాహ స్వామి నుండి వారాహీ మొదలైన మాతృశక్తులు వచ్చారు. అందులో శ్రీ వారాహీ దేవి చేతిలో చక్రం, ఖడ్గంతో రక్తబీజుడిని చంపడం కోసం సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది. ఆ విధంగా అష్టమాతృకలు అయ్యారు. వామన పురాణాం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి. ఈమెను అష్టభైరవులలో ఒకరు, ఉత్తర దిక్కుకు అధిపతి అయిన ఉన్మత్త భైరవుని శక్తిగా, ఉన్మత్త భైరవిగా, సిరి సంపదలను యిచ్చే దేవతగా చెప్పారు. మత్స్యపురాణం ప్రకారం వారాహీ దేవి మిగిలిన మాతృకా దేవతలతో కలిసి అంధకాసురుడనే రాక్షసుణ్ణి సంహరించింది. • ఈ సంవత్సరం జూన్ 30 నుంచి జులై 8 వరకు వారాహీ నవరాత్ర పుణ్యదినములు. కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు, నడిచే దైవం పరమపూజ్యులు శ్రీ సిద్దేశ్వరానంద భారతీ మహాస్వామి వారు మహాశక్తి క్షేత్రమైన శ్రీ శక్తిపీఠంలో ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా శ్రీ పాతాళ శ్వేత వారాహీదేవిని తమ అమృత హస్తములతో శ్రావణ పూర్ణిమనాడు ప్రతిష్టించారు. శ్రీ పాతాళ అధర్వణ ప్రత్యంగిరా దేవితో పాటుగా శ్రీ పాతాళ శ్వేత వారాహీదేవి ఏకపీఠం మీద దర్శనమివ్వటం యిక్కడి మరొక విశేషం. వారాహీ నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఆషాఢ శుద్ధ పాడ్యమి అంటే జూన్ 30వ తారీఖు నాడు కలశ స్థాపనతో నవరాత్రి ఉత్సవములు ప్రారంభమవుతాయి. త్రికాలములలో వారాహీ దేవికి విశేష పూజలు, వారాహీ మంత్రహోమములు, యంత్ర పూజలు, సువాసినీ పూజలు, అమ్మవారికి కూష్మాండ సమర్పణ, అన్నప్రసాద వితరణ మొదలైన కార్యక్రమములతో ఈ నవరాత్రులు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఇక్కడ శ్రీ శ్వేత వారాహీ దేవిని పూజించటానికి దేశం నలుమూలల నుండి మాత్రమే కాక విదేశాలనుండి కూడా భక్తులు వస్తారు. అమ్మ అనుగ్రహం పొందుతారు. • అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి),ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది... ఈవిడ మహావారాహీ దేవి స్వరూపం. బృహత్ వారాహి, లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహి, వజ్రవారాహి, రక్త పంచమి వారాహి, వార్తాళి, శ్వేత వారాహి, లక్ష్మీ వారాహి మొదలైన ఎన్నో రూపములలో అమ్మవారిని ఉపాసకులు ఆరాధిస్తారు. వారాహీ దేవికి ఎన్నో రూపములున్నప్పటికీ శ్వేత వరాహ కల్పంలో శ్వేత వారాహీ రూపంలో ఆరాధిస్తే త్వరగా కష్టములన్నింటినీ తొలగించి కామ్యములన్నీ యిస్తుంది. కొన్ని రూపములలో అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికీ, బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే ఈ తల్లి, శ్రీ శక్తి పీఠ మహాక్షేత్రంలో శ్వేత సుందర రూపంతో ఆహ్లాదినీ శక్తిగా చిరునవ్వులను చిందిస్తూ భక్తులను రక్షిస్తున్నది. యిక్కడ జరిగే అమ్మవారి మహిమలు అనిర్వచనీయం. వేలాది మంది భక్తుల కష్టములను తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా అమ్మవారు అలరారుతున్నది. ఈ పీఠంలో అనేకమంది భక్తులకు, సాధకులకు అమ్మవాఋ వరాహ రూపంలో సంచరిస్తూ దర్శనమిస్తుంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో సాధకులు ముందుకు సాగడానికి అనుగ్రహిస్తూ , తనను ఆరాధించే భక్తుల కోరికలను నెరవేరుస్తూ, మంత్ర హోమములు, పూజల ద్వారా భక్తులకు భాధల నుండి విముక్తి ప్రసాదిస్తున్న మహత్తర దైవం శ్రీ శ్వేతవారాహీ దేవి. ప్రతి మంగళవారం రాహుకాలంలో వారాహీ అమ్మవారి మంత్రహోమము, అమ్మవారికి కూష్మాండ సమర్పణ ప్రత్యేకమైన ఫలితములనిస్తాయి. • వారాహీ అమ్మవారిని చూసి ఉగ్ర దేవత అని కొందరు భయపడతారు. కానీ వారాహీదేవి శాంతస్వరూపిణి. కొలిచిన వెంటనే అనుగ్రహించే చల్లని తల్లి. కరుణారసమూర్తి. అమ్మవారు తన వజ్రశక్తితో శత్రువుల నుండి, దుష్ట శక్తులనుండి రక్షిస్తుంటుంది. శ్రీ శక్తిపీఠ మాహాక్షేత్రంలో భక్తులు అమ్మవారిని పూజించవచ్చు, హోమములు స్వయంగా చేసుకొని దేవి అనుగ్రహం పొందవచ్చు. శ్రీ వారాహీదేవి ని మనస్ఫూర్తిగా స్మరించుకుంటే అన్ని శుభాలే కలుగుతాయి. ఆషాఢమాస నవరాత్రులలో అమ్మవారిని దర్శించినా, పూజించినా, వారాహీ మంత్ర హోమములు చేసినా శత్రుబాధలు, అనారోగ్య సమస్యలు, నరదృష్టి దోషములు , గ్రహబాధలు తీరుతాయి. అట్లనే అమ్మవారు పొలములు, భూములు, స్థలములు, యిళ్ళు, స్థిరాస్తులకు ఉన్న యిబ్బందులు, వాస్తు దోషములు మొదలైన కష్టములను తొలగించి అనుకూలతను ప్రసాదిస్తుంది. శ్రీ శక్తిపీఠంలోని మహా శక్తి స్వరూపిణియైన శ్రీ శ్వేతవారాహీ దేవిని ఈ ఆషాఢ నవరాత్రులలో దర్శించి, ఆరాధించి, సేవించి ఆ తల్లి కృపకు పాత్రులమౌదాం., తరిద్దాం. • 9160455255 - 7737928773 • • ******** • Links to Watch Swamiji Videos:- • 1. గురువు యొక్క విశిష్టత ఏమిటి ?    • Ep 1-గురువు యొక్క విశిష్టత ఏమిటి ?Uni...   • 2. మంత్రం అంటే ఏమిటి ?    • Ep 2 - మంత్రం అంటే ఏమిటి ?What is Man...   • 3.మంత్రాలలో శబ్ధ స్వరూపం ఏమిటి ?    • మంత్రాలలో శబ్ధ స్వరూపం ఏమిటి ? The ph...   • 4. మంత్రానికి, వర్ణానికి ఉన్న సంబంధం ఏమిటి ?    • EP 4 - మంత్రానికి, వర్ణానికి ఉన్న సంబ...   • 5. మంత్రోపదేశం ఎవరు చేయవచ్చు ?    • మంత్రోపదేశం ఎవరు చేయవచ్చు?Who can do ...   • • For more details visit: https://srisakthipeetam.org • ************** • Note: Videos/Content in this channel are Copyrighted. • • #Sree Mantram Tv channel #manthram #siddheswaranandabharatispeeches #courtallam #siddheswarananda Mahaswami latest spiritual talks #Courtallam #mounaragam #mouna Swami #Manthramulam #Gurorvakyam #Sree Sakthi Peetam • #siddheswarananda Siddhaguruv#Manthram #shangrila USA#episode9

#############################









Content Report
Youtor.org / YTube video Downloader © 2025

created by www.youtor.org