బెల్లం కుడుములు వినాయక చవితి స్పెషల్ I Bellam Kudumulu I Vinayaka Chavithi bellamkudumulu trending
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=hdM-9upG4Ng
వినాయక చవితి స్పెషల్ ప్రసాదం బెల్లం కుడుములు తయారీ విధానం.. I Bellam Kudumulu I Vinayaka Chavithi Special Prasadam Recipe I ఆవిరి కుడుములు I Ganesh Chaturthi Recipes II Tasty Vindu • బెల్లం కుడుములు (Bellam Kudumulu) తయారీ విధానం.. • రాత్రంతా నీటిలో నానబెట్టిన 1 ½ లేదా 2 కప్పుల బియ్యాన్ని ఉదయాన్నే పలుచటి వస్త్రంపై ఆరబెట్టుకుని, ఇవి ఆరిన తరువాత మిక్సీ పట్టుకుని, పిండిని జల్లెడ పట్టుకుని ఒక కప్పు బియ్యం పిండిని పక్కన పెట్టుకోవాలి. • స్టవ్ ఆన్ చేసి కడాయి లేదా గిన్నెలో ఒక కప్పు నీళ్లు పోసి, ఇందులో చిటికెడు ఉప్పు, గంటసేపు నీటిలో నానబెట్టుకున్న పావు కప్పు లేదా 3 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల పచ్చి కొబ్బరి తురుమును వేసి కలుపుకోవాలి. • శనగపప్పు నానబెట్టడం వలన త్వరగా ఉడుకుతుంది కాబట్టి, శనగపప్పు ఉడికిన తరువాత ఇందులో 2 స్పూన్ల నెయ్యి, చిటికెడు దంచిపెట్టుకున్న యాలకుల పొడి, ముప్పావు కప్పు బెల్లం వేసి కలుపుకోవాలి. తీపి ఎక్కువ ఇష్టపడేవారు ఒక కప్పు బెల్లం వేసుకోవచ్చు. బెల్లానికి బదులుగా బెల్లం నీటిని కూడా ఉపయోగించవచ్చు. • బెల్లం కరిగిన తరువాత ఇందులో ఒక కప్పు తడి బియ్యం పిండిని వేసి బాగా కలుపుకోవాలి. పిండి దగ్గరకు అయ్యి గట్టిపడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. • ఇది చల్లారిన తరువాత చేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని, కాస్త పిండిని తీసుకుని అరచేతిలో పెట్టుకుని, చేతి వేళ్లతో దగ్గరగా వత్తుకుంటూ వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. • ఇప్పుడు ఇడ్లీ పాత్ర లేదా ఏదైనా గిన్నె తీసుకుని కొన్ని నీళ్లు పోసి దానిపై ప్లేట్ పెట్టి, పక్కన పెట్టుకున్న కుడుములను ప్లేట్ పై పెట్టి, దానిపై మూతపెట్టి 8 నుండి 10 నిముషాల పాటు ఆవిరి మీద ఉడికించి కిందకు దించుకోవాలి. • వినాయక చవితి స్పెషల్ బెల్లం కుడుములు లేదా ఆవిరి కుడుములు ప్రసాదం రెడీ.. • • #kudumulu #bellamkudumulu #aavirikudumulu #avirikudumulu #undrallu #ravaundrallu #modak #modakalu #vinayakachavithi #vinayakachathurthi #vinayakachavithi2024 #ganeshchaturthi #ganeshchaturthi2024 #ganeshchaturthispecial #ganeshchaturthiprasadam #prasadam #prasadamrecipes #prasadamrecipesintelugu #vinayakachavithispecial #vinayakachavithirecipes #vinayakachavithiprasadam #vinayakachavithiprasadalu #vinayakachavithipoojavidhanam #special #specialdish #specialprasadam #happyganeshchaturthi #happyvinayakachavithi #happyvinayagarchaturthi #trendingrecipe #trendingshorts #trendingvideo #viralfood #viralrecipe #viralshorts
#############################
