మహాసభలు 2024లో ఆచార్య సచ్చిదానందమూర్తిగారు 9224 UmamaheswararaoYarramsettiSathguruTatvam
>> YOUR LINK HERE: ___ http://youtube.com/watch?v=jMjmohAnxOw
#Sathguru #tatvam #sadhguru #umaralisha #swami #svvvap1472 #svvvap • Video Credits - @SathguruTatvam • 9-2-2024 మహాసభలు మొదటి రోజు సభ • Dt: 9.2.2024 PITHAPURAM. News Letter • తాత్త్విక జీవన విధానం మానవుడికి ఎంతో అవసరం • పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు • దైనందిన జీవితంలో మానవుడికి తాత్త్విక జీవన విధానం ఎంతో అవసరం అని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అన్నారు. పిఠాపురం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజులు పాటు జరిగే పీఠం 96వ వార్షిక మహాజ్ఞానసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో పీఠాధిపతి సభలను ప్రారంభించారు. • ఈ సందర్భంగా సధ్గురువర్యులు మాట్లాడుతూ జీవన ప్రయాణంలో అనేక ఒత్తిడులు, సందేహాలు, అలజడి, అశాంతి, సమస్యలతో జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేసుకుంటున్న మానవుడు తన మనస్సును ఆధ్యాత్మిక పరమైన కోణంలో తీర్చిదిద్దుకోగలిగినట్లైతే వాటిన్నింటిని పరిష్కరించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. తాత్త్విక జీవన విధానం ఈనాటి మానవాళికి ఎంతో అవసరం అని పేర్కొన్నారు. తాత్త్విక జ్ఞానం పొందడం ద్వారా అంతర్లీనంగా ఉన్న జ్ఞాన నేత్రం తెరువబడుతుందని వెల్లడించారు. మానవుడిని మహనీయుడిగా మలిచే జ్ఞాన నేత్రం పొందడానికి గురుముఖంగా ఆధ్యాత్మిక తత్త్వాన్ని గ్రహించాలని తెలిపారు. • వందలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక తత్వ ప్రబోధం, సామాజిక సేవలను నిర్వహిస్తూ మతసామరస్య సదస్సులతో మానవతా విలువల పరిరక్షణ కొరకు పాటుపడుతున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు. • పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. అనంతరం నివేదిక 2024 గ్రంథాన్ని పీఠాధిపతులు ఉమర్ ఆలీషా స్వామివారు సభలో ఆవిష్కరించారు. • సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు మాట్లాడుతూ చిన్నతనంలోనే సాహితీ సేవను ప్రారంభించిన మహనీయుడు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 6వ పీఠాధిపతి కవిశేఖర బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా అని అన్నారు. 18వ శతాబ్దంలో సమాజంలో స్త్రీల వెనకబాటుతనాన్ని గుర్తించి స్త్రీ జనోద్ధరణకు పాటుపడిన విశిష్ట వ్యక్తి ఉమర్ ఆలీషా అని వెల్లడించారు. తిరుపతి వేంకట కవులతో సమానంగా అనేక గ్రంథాలను రచించిన మహాకవి ఆలీషా అని అన్నారు. ఆలీషా రచించిన బర్హిణీ దేవి కావ్యాన్ని తాను చదివానని, ఆ కావ్యం గురించి అందరికీ తెలియజేయాలనే భావనతో కావ్యంలోని పద్యాల తాత్పర్యాలను వ్యాఖ్యానంగా తాను రచించానని వెల్లడించారు. తదుపరి కావ్యంలోని కొన్ని పద్యాలకు సంబంధించిన తాత్పర్యాలను సభికులకు వివరించారు. • మరొక ముఖ్య అతిథి రాష్ట్రియ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి నుండి విచ్చేసిన ఆచార్య ఏ. సచ్చిదానందమూర్తిగారు మాట్లాడుతూ మానవుడు తాను పొందిన జ్ఞానాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవడమే విజ్ఞానమని, శారీరక, మానసిక నిర్మలత్వం అనే ఆత్మీయ భావనయే ఆధ్యాత్మికం అని తెలియజేసారు. విజ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను శిష్యులకు అందిస్తున్న మహోన్నత పీఠం • శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు. మానవత్వమే ఈశ్వరత్వం, ఈశ్వరత్వమే భగవత్ తత్వం అని వెల్లడించారు. మానవుడిని మహనీయుడిగా తీర్చిదిద్దుతున్న మతాతీత ఆధునిక మానవతా దేవాలయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాన్ని దర్శించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. • అనంతరం పీఠ సభ్యులు గోపిశెట్టి అభినవ్ చంద్రక్, దొండపాటి ఉమామహేశ్వరి, ఆర్. కె. శివరామకృష్ణ, కె. సూర్యలతగార్లు పీఠం యొక్క విశిష్టతను తమ ప్రసంగాల ద్వారా తెలియజేసారు. ఈ సందర్బంగా పిఠాపురం మాజీ శాసనసభ్యుడు ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ, పట్టణ సీఐ శ్రీనివాసు, ఉమర్ ఆలీషా సాహితీ సమితి కార్యదర్శి దాయన సురేష్ చంద్రజీ, శ్రీ త్సవటపల్లి మురళీకృష్ణ, భవర్ లాల్ జైన్ తదితరులు పీఠాధిపతులు ఉమర్ ఆలీషా స్వామివారిని దర్శించుకున్నారు. • ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు చిన్నారుల కొరకు పాల కేంద్రం, శిశు సంరక్షణా కేంద్రాలను, ప్రాథమిక వైద్య శిబిరాలతో పాటుగా 34 కేంద్రాలను ఏర్పాటు చేసారు. సభలో నిర్వహించిన సంగీత విభావరిలో ఎ. ఉమ, ఐ. ఉమ, ముకుంద్ ప్రవీణ్ ఆలపించిన కీర్తనలు సభికులను రంజింప చేసాయి. సభలో పాల్గొనడానికి దేశ, విదేశాలనుండి విచ్చేసిన సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా 351మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు.
#############################
