Shiva Padamalika Lord Shiva Devotionals Bhakthi Songs My Bhakthi Tv
YOUR LINK HERE:
http://youtube.com/watch?v=wRpwIbb76FA
Title: Shiva Padamalika • Lyrics: Vishwanadha Srinivasa Rao • Composed by: Baggam Dhananjaya • Singer: Mula Srilatha • #devotionalsongsintelugu • #devotionalchants • #shivadevotionals • #shivadevotionalsongstelugu • #shivadevotionalsongs • Lord Shiva Devotionals • Published By : Musichouse • Produced by: B.N Murthy Palli Nagabhushana Rao • Recorded at Sri Matha Digital Recording Studio, Visakhapatnam. (8106766133) • పంచాక్షరి యే నీ మంత్రం • శుభములు ఒసగే శివ మంత్రం • సౌమ్య రూపమే నీ తంత్రం • లింగాకారమే నీ రూపం • ప్రాచీనాన పసుపతిగా • వేదాలందు శ్రీ రుద్రునిగా • శైవం లో పరమాత్ముని గా • పూజలు పొందితి విలలోన • జగములకెల్లా జగన్మాత • జగతికి మూలం నీవమ్మా • బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల • సృష్టికి శక్తివి నీవమ్మా • శాస్వతానికి చిహ్నముగా • గంగాదేవి ని శిరముంచి • నిగ్రహానికి గురుతుగనే • వంక జాబిలి తలదాల్చి • పరమాత్ముని కీ జీవాత్మా • దేహముపైన సర్పములు • త్రిగునాలకు ప్రతి రూపం • త్రిశూలము కరమున పట్టావు • శబ్ద బ్రహ్మ స్వరూపమున • చేతిలొ ఢమరుక నాదం తో • అహమును విడనాడా లంటూ • పులి చర్మమును ధరియించే • పరిశుద్ధతకు భస్మము నూ • కాయమంతటా పూసుకొనీ • వాంచిత మదికి కళ్లెం గా • పులి చర్మముపై శయనించే • నాల్గు వేదముల సారముగా • జింక చరణములు చేపట్టి • సత్సాంగత్యం ధర్మ నిరతికీ • నంది వాహనం ఎక్కితివీ • జ్ఞాన శక్తికీ సూచన గా • మూడవ నేత్రం పొందితివీ • దివ్య దృష్టితో మము కాచీ • త్రినేత్ర నామం పొందావు • బహు రూపాలను దాల్చావు • పలు విధముల మము చూసావు • ప్రేమ స్వరూపం చూపావు • దయ గల ప్రభువుగ నిలిచావు • జ్ఞాన గురువు అవతారంలో • దక్షిణా మూర్తి గ వెలసావు • మౌన ముద్రనే మదినెంచి • సందేహాలను తీర్చావు • శివ రూపములు రెండైనా • ప్రతిమ రూపమూ నీకున్నా • లింగ రూపమే దాల్చా వూ • జనులకు దరిశన మిచ్చావూ • స్వయంభు వెలసిత లింగములు • దైవిక ఋష్య ప్రతిష్టితలు • మానుష బాణ లింగములు • ఇలలో ధన్యత నోసగునయ • అన్నమలైశ్వర తేజో లింగం • జలలింగముగా జంబుకేశ్వరుడు • చిదంబరేశ్వర ఆకాశ లింగం • ఏకాంబరేశ్వర పృథ్వీ లింగం • కాళహస్తిలో వాయు లింగముగా • పంచ భూత రూప లింగములు కాంచినంతనే తిమిరము తొలగును • భవసాగరములు హరణమొందును • అమరావతిలో అమరా రామము • ద్రాక్షారామ భీమేశ్వరుడు • కుమారరామ కుమార భీమేశ్వర • భీమారామ సోమేశ్వరుడు • పాలకొల్లులో క్షీరా రామము • పంచారామ క్షేత్రం దర్శనం • ముక్తిని ఒసగే మార్గము చూపి • మదిలో శాంతిని ఒస గునయ • కురుక్షేత్రమున పాండవులు • దాయాదుల ను హతమార్చి • బ్రహ్మహత్యా పాతకము • పాపకర్మలుగ తలచితిరి • పాప విమోచన మదినెంచీ • శివదర్శనము పొందుటకై • కాశీ చే రిన పాండవ సేనకు • విముఖత చూపిన ఈశ్వరుడు • నందీశ్వరుడై కాశీ వీడి • ఉత్తర దిశగా పయనించావు • పంచ భాగములుగ విడినావు • పంచ కేదారుల భాసిల్లావు • కల్పేశ్వరమున ఝుటా ఝాటము • మధ్య మహేశ్వర నాభీ భాగము • కేదార్ నాధ్ లో మూపురము • తుంగనాధ్ లో కరములు నూ • రుద్రనాధ్ లో నీ ముఖ బింభము • లింగరూపంలో వెలసిన చందము • మహిమలు తెలుపుట మాతరమా • మదిలో స్థిరముగ వుండవయ • ద్వాదశ జ్యోతిర్లింగ ములై • భువిలో వెలసిన నీ రూపం • కాంచుట మాకు సుకృతమూ • సతతం మదిలో నిలిపెదమూ • చంద్రుని చేత ప్రతిష్టితమై • సోమనాథ లింగము విలసిల్లే • ప్రభాస క్షేత్రముగా విరాజిల్లే • సౌరాష్ట్ర మున నిలచితివీ • పాతాళ గంగ గ కృష్ణమ్మా • ఒడిలో శ్రీశైల క్షేత్రంలో • మల్లికార్జున నామంతో • భక్తుల స్థుతులను పొందావు • సప్త సాగర తీర్థములు • ఏకాదశ రుద్రులతో • మహాకాలుడై ఉజ్జయినందు • మము పాలించగ వెలసేవూ • ఏక లింగమే జత భాగములుగా • ఓంకారేశ్వర అమలేశ్వరులుగ • నర్మదా నది తీరము లోనా • కనులకు విందు ను చేసావూ • సహ్యాద్రి శిఖరము అంచున • పర్లీ లోనా వైద్యనాధుడై • ధన్వంతరి గా అమృతము • ఒసగుననే ఒక నమ్మకమూ • త్రిపురాసుర వధనంతరము • సేద తీరితివీ పరమ శివా • భీమసంకర నామంతో • చంద్ర భాగమున వెలసితివీ • శ్రీరాముడు శివుని అర్చిం చీ • ధన్యత నొందిన ప్రదేశము గా • రామేశ్వరము ప్రాంతములో • రామేశ్వరుడిగా వెలిసావు • [07/11/2020, 13:04] Viswanath Srini2: నాగేశ్వరుడిగ ద్వారక చెంత • నాగ నాధుడను నామము తో • ద్వారక ఔధ్ గ్రామ్ అల్మోరా • మూడు చోటులా కాంచితి మయ్యా • వరుణ అశీ అను ఇరు నదులూ • గంగానదిలో కలిసే చోటు • విశ్వనాథు డై వెలసే వు • కాశీ పురమున మము బ్రోచేవూ • గంగా దేవి మందిర చెంత • గౌతమీ న దీ తీరములో • నాసిక్ నగరపు వాకిటిలో • త్రయంబ కేసూడవైనావు • మందాకిని కీ తీరములో • హిమశిఖరాల లోగిలిలో • కేదారేశ్వర రూపంలో • మము కాచేటందుకు వెలిశావు • ఎల్లోరా గుహముల చేరువ • ఘ్రు ష్ట్నేశ్వేరుడుగా భాసిల్లే • కుసు మేశ్వరుడను నామంతో • భక్తుల మొరలను విన్నావూ • [07/11/2020, 16:57] Viswanath Srini2: లింగోద్భవ కర సాంబ శివా • అభిషేక ప్రియ మహాదేవా • కల్మష మెరుగని నీ నామం • తలచిన శాంతము కలుగునయా • లోక కళ్యాణ కారుడవై • కంఠము నందు గరళముతో • నీల kanthudi నామంతో • జగతిని కాపాడితి వయ్యా • కైలాసమునకు అధిపతివీ • హిమ శిఖరాన వెలసితివీ • లలాటము నా నేత్రముతో • ముక్కంటిగ వెలుగొండావూ • గౌరీ దేవిని పెళ్లా డీ • సగ భాగమునూ సతికిచ్చీ • అర్ధ నారీశ్వర తత్వమునూ • జగతికి చాటి చూపావూ • దోషములుంటే మము మన్నించీ • ఆది దంపతులై దీవించీ • మమ్ములనేమో కాపాడి • ధన్యత ఒసగుము సాంబయ్య • 1. MusicHouse 27: / musichouse27 • 2. MyBhaktitv: / mybhaktitv • 3. MusicHouse 27 Twitter: / musichouse27 • 4. Sri Matha Music Facebook: / srimatha-music-109674363784497 • • NO COPYRIGHT INFRINGEMENT INTENDED. • COPYRIGHT NOTICE: • Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting YouTube about a Copyright Infringement. Thank You, sir... • ****************************************************************************************************************** • My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.
#############################
